సాక్షి డిజిటల్ న్యూస్ టుడే/ములుగు జిల్లా ఇంచార్జీ 04.05.26: ములుగు జిల్లా, వాజేడు మండలం పరిధిలోని పేరూరు గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బొల్లె నరేష్ స్థానిక పోస్టాఫీసులో అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ గా విధులు నిర్వర్తిస్తున్నారు.కాగా నరేష్ శనివారం రోజు ఒక పెళ్లి వేడుకకు హాజరై, అక్కడ ఉత్సాహంగా డాన్స్ చేసినట్లు తెలిపారు. కార్యక్రమం ముగిసిన అనంతరం ఇంటికి తిరిగి వచ్చిన అతను కొద్దిసేపటికి అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు గమనించేలోపే అతను కుప్పకూలిపోయాడు.ఆరోగ్యంగా కనిపించిన వ్యక్తి ఒక్కసారిగా మృతి చెందడం గ్రామంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.ఈ ఘటనతో గ్రామస్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. డీజే హై ఫ్రీక్వెన్సీ వల్లనే నరేష్ కు గుండె పోటు వచ్చి ఉండవచ్చని గ్రామస్థులు అభిప్రాయ పడుతున్నారు. యువతలో ఇటువంటి గుండెపోటు ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో, ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.