అడ్వకేట్‌పై ఇంట్లోకి చొరబడి దాడి చంపుతామని బెదిరింపు

సాక్షి డిజిటల్ న్యూస్ అనంతపురం, సెప్టెంబర్ 3 అనంతపురం జిల్లా ఇంచార్జ్ అనంతపురం ఈరోజు అనంతపురం టౌన్‌లోని జీసస్ నగర్‌లో అడ్వకేట్ యనమల భాస్కర్ రెడ్డిపై కొందరు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి దాడి చేసి, చంపుతామని బెదిరించినట్లు అనంతపురం-రెండవ పోలీస్ స్టేషన్ నందు సి. ఐ. పుల్లయ్య కు టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.ఫిర్యాదు వివరాల ప్రకారం.. జీసస్ నగర్‌లోని ఎస్.వి.డిగ్రీ కాలేజీ ఎదురుగా నివాసం ఉంటున్న యనమల భాస్కర్ రెడ్డి (68) అడ్వకేట్‌గా పనిచేస్తున్నారు. చందు బార్ అండ్ రెస్టారెంట్ యజమాని రేవనూరు వెంకటేష్‌కు తాను ఇచ్చిన అప్పుకు సంబంధించిన చెక్కు విషయంలో అనంతపురం కోర్టులో దావా వేసినట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి కోర్టు రేవనూరు వెంకటేష్‌కు వారంట్ జారీ చేసినట్లు పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో కేసు విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నావంటూ తనను వెంకటేష్ బెదిరిస్తున్నాడని భాస్కర్ రెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. సెప్టెంబర్ 2 ఉదయం సుమారు 7:30 గంటల సమయంలో తాను ఇంట్లో ఉండగా వెంకటేష్, అతని భార్యతో పాటు మరికొందరు వ్యక్తులు ఇంటి తలుపులు కొట్టి, తలుపు తెరవగానే బలవంతంగా ఇంట్లోకి చొరబడ్డారని ఆరోపించారు. అనంతరం ఇంటి తలుపులకు గడియ పెట్టి తనను మంచంపై పడవేసి గొంతు పట్టుకుని కాళ్లు, చేతులతో కొట్టారని, కేసు విషయంలో తలదూరిస్తే చంపుతామని బెదిరించారని ఫిర్యాదులో తెలిపారు. తాను గట్టిగా కేకలు వేయడంతో ఇంటి పక్కన ఉన్న సాయి, శ్రీనివాసరెడ్డి, వంశీ అక్కడికి వచ్చి తనను వారి నుంచి విడిపించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో తన ఎడమ మోచేతి భాగంలో వాపు గాయం అయినట్లు భాస్కర్ రెడ్డి తెలిపారు. తన ఇంట్లోకి చొరబడి దాడి చేసి, చంపుతామని బెదిరించిన రేవనూరు వెంకటేష్, అతని భార్యతో పాటు దాడికి పాల్పడిన ఇతరులపై చట్టపరమైన చర్యలు తీసుకుని తనకువారి నుండి వారి నుండి నా ప్రాణాలకు ముప్పు ఉంది అంటూ రెండవ పోలీస్ సీ. ఐ. కు రాతా పూర్వకంగా ఫిర్యాదు చేస్తూ వారిని నాకు న్యాయం చేయాలని కోరడం జరిగింది న్యాయం చేయాలని పోలీసులను కోరారు.