ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

సాక్షి డిజిటల్ న్యూస్, వేంపల్లి, సెప్టెంబర్ :03 (పులివెందుల తాలూకా రిపోర్టర్ గోసులఅంజనేయులు) పులివెందులనియోజకవర్గం, వేంపల్లి మండలం లో మదర్ తెరిసా అనాధా శ్రమంలో వృద్ధులకు అల్పాహారం, టిఫిన్ మరియు కేక్ కటింగ్ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.మానవ సేవే మాధవసేవ అని చాటి చెప్పిన పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ఈరోజు ఈ సేవా కార్యక్రమం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో సింగంశెట్టి సూర్యనారాయణ, గురప్ప, మారుతి,ప్రసాద్ బాబు, నరసింహ పలువురు నాయకులు పాల్గొన్నారు.