ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మార్వో రామోజీ పల్లి గ్రామంలో

సాక్షి డిజిటల్ న్యూస్ సెప్టెంబర్ 3 పెద్ద శంకరంపేట్ మండలం మెదక్ జిల్లా (రిపోర్టర్ దొడ్ల కిరణ్) పెద్ద శంకరంపేట మండలం రామోజీపల్లి గ్రామంలో ఓటర్ కార్డు నమోదు ప్రక్రియ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రం ఎమ్మార్వో రామోజీ పల్లి గ్రామపంచాయతీ కార్యాలయం ను ఆకస్మిక తనిఖీ చేశారు. గ్రామంలో జరుగుతున ఓటర్ కార్డు నమోదు ప్రక్రియ ను పరిశీలించి బి ఎల్ ఓ చేస్తున నమోదు పనితీరును చూసి ప్రశంసించారు అదే విధంగా సరైనా ఆదారాలు లేని ఓటరుల గురించి బి ఎల్ ఓ లకు సూచనలు ఇవ్వడం జరిగింది. గ్రామం లో జరుగుతున్న అభివృద్ధి పనులు పరిసరాల పరిశుభ్రత తదితర పనుల గురించి విచారించి పంచాయితీ పని తీరు చాల బాగుంది అన్ని గ్రామాలు మీ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలి అని చెప్పారు.