ఆరు గ్యారంటీల మాయ.. 420 హామీల గాయం! కాంగ్రెస్‌పై మల్లన్న గర్జన.. బోడుప్పల్‌లో బీఆర్‌ఎస్‌ భగ్గు!

★ మాటలు కాదు.. హామీల అమలుపై లెక్కలు చెప్పాలంటూ నినాదాలు

సాక్షి డిజిటల్ న్యూస్ సెప్టెంబర్ 3, 2026 మేడ్చల్ మల్కాజ్గిరి రిపోర్టర్ చంద్రశేఖర్ కాంగ్రెస్‌ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనపై బోడుప్పల్‌లో బీఆర్‌ఎస్‌ పిలుపు మేరకు బోడుప్పల్‌ అధ్యక్షుడు, మాజీ జెడ్పీటీసీ మంద సంజీవరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ సాగింది.అంబేద్కర్‌ సర్కిల్‌ నుంచి ఎన్టీఆర్‌ విగ్రహం వరకు 420 హామీలను ప్రతిబింబిస్తూ 420 మీటర్ల భారీ బ్యానర్‌తో ప్రదర్శన చేపట్టారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల అమలులో విఫలమైందంటూ బీఆర్‌ఎస్‌ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీలు, 420 హామీలతో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు.వికలాంగుల పింఛన్లు, మహిళలకు రూ.2,500, ఆడబిడ్డల పెళ్లికి తులం బంగారం ఏమయ్యాయని ప్రశ్నించారు.రైతు బీమా, నిరుద్యోగ భృతి వంటి హామీల పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని నిలదీశారు.ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.