ఉపాధ్యాయులకు క్రీడా పోటీలు

మండల స్థాయిలో ఉత్సాహంగా ఆటల పోటీలు

సాక్షి డిజిటల్ న్యూస్ ,సెప్టెంబర్ 3, కోట మండల రిపోర్టర్ వెంకట కృష్ణయ్య: సెప్టెంబర్ 5న జరగనున్న ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల స్థాయిలో ఉపాధ్యాయులకు బుధవారం క్రీడా పోటీలను నిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రారంభమైన ఈ పోటీల్లో మండలంలోని వివిధ పాఠశాలలకుచెందినఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మ్యూజికల్ చైర్స్, రన్నింగ్ రేస్, లక్కీ గేమ్, బాల్ గేమ్, షాట్‌పుట్ తదితర పోటీలను నిర్వహించారు. ఉపాధ్యాయులు పోటాపోటీగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. దీంతో పోటీలుఆద్యంతంఉత్సాహ భరిత వాతావరణంలో సాగాయి.పోటీల్లో ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచిన ఉపాధ్యాయులకు సెప్టెంబర్ 5న నిర్వహించే ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో బహుమతులు అందజేయనున్నట్లు ఎంఈఓ–1 శైలజ, ఎంఈఓ–2 మస్తానయ్య తెలిపారు. ఉపాధ్యాయుల్లో ఉత్సాహాన్ని పెంపొందించడంతో పాటు పరస్పర స్నేహభావాన్ని పెంచేందుకు ఇటువంటి క్రీడా పోటీలు దోహదపడతాయని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మండలంలోని ఉపాధ్యాయులు, విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు.