సాక్షి డిజిటల్ న్యూస్ సెప్టెంబర్ 3, 2026 మేడ్చల్ మల్కాజ్గిరి రిపోర్టర్ చంద్రశేఖర్ కురుమ సంఘం నూతన కమిటీ సభ్యులను చెంగిచెర్ల డివిజన్ బీజేపీ ఉపాధ్యక్షులు గండిపల్లి రాజు ఘనంగా సన్మానించారు. కురుమ సంఘం నూతన అధ్యక్షులు చిందం వి.భాస్కర్ కురుమ, ప్రధాన కార్యదర్శి కుండి సతీష్ కురుమ ఆధ్వర్యంలోని నూతన కమిటీ సభ్యులు గండిపల్లి రాజును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన కమిటీని శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. కురుమ సంఘం ఐక్యత, అభివృద్ధి కోసం నూతన కమిటీ సమష్టిగా కృషి చేయాలని గండిపల్లి రాజు ఆకాంక్షించారు. సంఘ సభ్యుల సంక్షేమం, సామాజిక అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షులు గొరిగే నర్సింహా కురుమ, సీర వెంకటేష్ కురుమ, ముఖ్య సలహాదారు నోముల యాదగిరి కురుమ, దడిగే నర్సింహా కురుమ, జల్లి సిద్ధులు కురుమ, తాటిపల్లి కుమార్ కురుమ తదితరులు పాల్గొన్నారు.