
సాక్షి డిజిటల్ న్యూస్ ఆగస్టు 3 అచ్చంపేట (రిపోర్టర్ కొమ్ము రేణయ్య) కాంగ్రెస్ పార్టీ తన 1000 రోజుల పాలనలో తెలంగాణ ప్రజను నట్టేటా ముంచిందని అచ్చంపేట బిఆర్ఎస్ నాయకులు శ్రీకాంత్ భీమా మండి పడ్డారు. బీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు అచ్చంపేట నియోజకవర్గంలో బీ ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ ఇచ్చిన మోసపూరిత హామీలతో రూపొందించిన 420 మీటర్ల ప్లెక్సీ తో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అడుగడుగున హర్షం వ్యక్తం చేస్తూ బిఆర్ఎస్ నిరసనకు మద్దతు పలికిన అచ్చంపేట పట్టణ ప్రజలు వద్దురా నాయనా ఈ కాంగ్రెస్ పాలన అంటూ నినాదాలతో అచ్చంపేట పట్టణం మార్మోగింది. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వనికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమం లో బీ ఆర్ ఎస్ పార్టీ నాయకులు ఎడ్ల నరసింహ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, ఆరోగ్యారంటీల అమలులో విఫలమైందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు వంద రోజుల్లో హామీలు నెరవేరుస్తామని చెప్పి 1000 రోజులు గడిచినా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసింది అన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఊరూరా ప్రజలకు కాంగ్రెస్ బాకీ కార్డులు పంచి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండ గడతామన్నారు. టిఆర్ఎస్ పార్టీ తరఫున ప్రజలకు అండగా ఉండి ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు పడిన బాకీ కార్డులను ప్రదర్శిస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలను తీవ్రంగా ఖండించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ అచ్చంపేట నాయకులు శ్రీకాంత్ భీమా, పోకల మనోహర్, మాజీ మున్సిపల్ చైర్మన్ తులసి రామ్ నాయక్ మాజీ ఎంపీపీ మేడమోని పర్వతాలు, తెలంగాణ ఉద్యమ నేత మాజీ మున్సిపల్ చైర్మన్ నరసింహ గౌడ్, మైనార్టీ సీనియర్ నాయకులు అమినోద్దిన్, మాజీ కౌన్సిలర్లు మను పటేల్, అంతటి శివ మరియు స్థానిక నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.