
సాక్షి డిజిటల్ న్యూస్ సెప్టెంబర్ 03 సూర్యాపేట ప్రతినిధి బాణోతు రామకృష్ణ గరిడేపల్లి మండలంలోని అన్ని గ్రామ ప్రజలు పార్టీ కార్యకర్తలు రేపు జరుగునున్న మిర్యాలగూడలో రైతు మహాధర్నాలను మండలంలో ఉన్న అన్ని గ్రామాల ప్రజలు రైతులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ధర్నాలో పాల్గొని విజయవంతం చేయాలని మండల బిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు గుగులోతు కృష్ణ నాయక్ అన్నారు ఈరోజు మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ 420 డిక్లరేషన్ హామీలు ఇచ్చి ప్రజలను నట్టేట ముంచారని దొంగ హామీలు ఇచ్చి సామాన్య ప్రజలను మోసం చేశారని వారు అన్నారు రైతులను ఉద్దేశించి సాగర్ ఎడమ కాలువలో 538 అడుగుల నీరు ఉన్నా కూడా ఆంధ్ర వారికి తొత్తులుగా మారి ఎడమ కాలువ రైతాంగానికి నీరు ఇచ్చే పరిస్థితి లేదని వారు అన్నారు రేపు జరగబోయే మహా ధర్నా కార్యక్రమంలో అన్ని వర్గాల ప్రజలు రైతులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు పాల్గొని మహాధర్నాను విజయవంతం చేయాలని కోరారు.