కైకలూరులో దివంగత మహానేత డా. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 17వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. విగ్రహానికి పూలమాల వేసి డి ఎన్ ఆర్ నివాళులర్పించారు .

సాక్షి డిజిటల్ న్యూస్ సెప్టెంబర్ 3 (రిపోర్టర్ పరస శ్రీనివాసరావు కలిదిండి) ఏలూరు జిల్లా కైకలూరు తాలూకా కలిదిండి మండలం దివంగత ముఖ్యమంత్రి, ప్రజా హృదయ నేత డా. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా కైకలూరులో ఘన నివాళులు అర్పించారు. కైకలూరు సంత మార్కెట్ వద్ద ఉన్న డా. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి ఏలూరు జిల్లా వైఎస్సార్‌సీపీ కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డి ఎన్ ఆర్) నాయకులు, కార్యకర్తలతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డి ఎన్ ఆర్ మాట్లాడుతూ.. డా. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి భౌతికంగా మనకు దూరమై 17 ఏళ్లు గడిచినా, ఆయన ప్రజల కోసం చేసిన సేవలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు. పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం వైఎస్సార్‌ చేసిన కృషిని ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసిన మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి ఇదే తమ ఘన నివాళి అని డి ఎన్ ఆర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల, గ్రామస్థాయి నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్‌ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులర్పించారు.