కొత్త కాలనీలో రూ.5 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం

సాక్షి డిజిటల్ డివిజన్ గద్వాల్, సెప్టెంబర్ 3, రాజోలి మండలం న్యూస్, జోగులాంబ గద్వాల్ జిల్లా, రాజోలి గ్రామంలోని కొత్త కాలనీలో, కస్తూర్బా గాంధీ బాలికల హాస్టల్ పాఠశాల విద్యార్థులు రాకపోకలు సాగించేందుకుఎదుర్కొంటున్నఇబ్బందులను గుర్తించిన, గ్రామ, పాలకవర్గంవెంటనేస్పందించిందివిద్యార్థుల సౌకర్యార్థం రూ.5 లక్షల అంచనా వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు గ్రామ సర్పంచ్ సి.గంగిరెడ్డి , ఉప సర్పంచ్ సంధ్యా శ్రీరామ్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి ఘనంగా శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ, ప్రజలు మరియు విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలను కల్పించేందుకు కృషి చేస్తామని వారు తెలిపారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు, జోగులాంబ గద్వాల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా వైస్ ప్రెసిడెంట్ వై. ఎల్లారెడ్డి, రాజోలి మండల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కే అసీన్, పులిపాటి దస్తగిరి, చేనేత సహకార సంఘం అధ్యక్షుడు పసలాది వెంకటేష్ శ్రీ వైకుంఠ నారాయణస్వామి దేవాలయ చైర్మన్లక్ష్మీనారాయణ రెడ్డిమాజీ ఎంపీటీసీ జయన్న రైతు సంఘం అధ్యక్షులు, కె వెంకటేశ్వర్లు, చేనేత సహకార సంఘం వైస్ ప్రెసిడెంట్ బండ శ్రీరాములు, కర్రే ఆదన్నమాజీ జడ్పీటీసీ సభ్యురాలు ముగన్న సుగుణమ్మ, వార్డు సభ్యులు అడివి అన్న వార్డు సభ్యులు సత్య వార్డు సభ్యులు సత్తార్, వార్డు సభ్యులు చాంద్ బాషా వార్డు సభ్యులు బాబు వార్డు సభ్యులు రామన్న సభ్యులు ఏ. గోపి సభ్యులు రషీద్ భాయ్ సభ్యులు గోనెగండ్ల రఫీ సభ్యులు ముళ్ళ అనీఫ్, సభ్యులు నడిపి కృష్ణ తదితర నాయకులు, ప్రజాప్రతినిధులు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. విద్యార్థుల సౌకర్యమే లక్ష్యం గ్రామాభివృద్ధే ధ్యేయం, కొత్త రాజోలి అభివృద్ధి పథంలో మరో ముందడుగు,