
సాక్షి డిజిటల్ న్యూస్ బాలాయ పల్లి ఆగష్టు 03 మండలంలో ఎక్కడైతే చెరువులు ఆక్రమణ జరిగిందో వెంటనే అధికారులు పరిశీలన చేసి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని జయంపు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం , సోసైటి భవనం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం మండలములోని జయంపు గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు జయంపులో రూ.9.20 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.ఇక రూ.3.62 కోట్ల పనులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సహాకార సంఘం కార్యాల యం–గోడౌన్‌కు శ్రీకారం చుట్టామన్నారు.రూ.1.93 కోట్ల వ్యయంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే రూ.1.26 కోట్లతో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం (పిఎసి ఎస్) నూతన కార్యాలయ భవనం, గోడౌన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా రూ.43.60 లక్షలతో నిర్మించిన స్వర్ణ గ్రామం/గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించారు. జయంపు గ్రామంలో ఇప్పటివరకు రూ.9.20 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రహదారులు, మౌలిక వసతులు, ఆరోగ్యం, వ్యవసాయం, గ్రామ పరిపాలన తదితర రంగాల్లో అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు.రెండేళ్ల సంక్షేమంపై ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ఎమ్మెల్యే వివరించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు, రైతులకు అవసరమైన సహకార సేవలు, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. అద్వ నంగా ఉన్న పంచాయతీ భవనం పరిశీలించారు.భవనం ప్రస్తుత పరిస్థితి,స్థానికంగా ఉన్న సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ భవనం అభివృద్ధి, మరమ్మతులకు అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. కన్నతల్లిని ఉన్నా ఊరిని కాపాడుదాం...మాజీ ఎంపీపీ ఏవరైతే కన్నతల్లిని ఉన్న ఊరిని అభివృద్ధి చేయాలని ఊరు అభివృద్ధి కి అహర్నిశలు పనిచేసేందుకు తాను తపనుపడుతున్నా. మీరు వంతు సహాకారించాలని దండం పెట్టి మాజీ ఎంపీపీ, జయంపు సహాకారసంఘం అధ్యక్షుడు సింగంశెట్టి. భాస్కర్ రావు కోరాలు. ఊరు బాగుండాలని అనెక సంక్షేమ పథకాలు ఎమ్మెల్యే ని అడిగి తీసుకోస్తున్నామని తెలిపారు. గతంలో అభివృద్ధి లేదు నేడు అభివృద్ధి చేశామని సగర్వంగా చెప్పుకుంటున్నారు. అన్నా మా ఊరుకి చుట్టుపక్కల పేద పిల్లలు ఉన్నారు ఉన్నత చదువులు చదువుకోలేక ఉన్నారు. జూనియర్ కళాశాల మంజూరు చేయలని చెప్పారు. ఇక ఆర్టీసీ బస్సు ఊరులో కి రాక వృద్ధులు, మహిళాలు అవస్థలుపడుతున్నారు.ఊరులోపల బస్సు రైల్వేస్టేషన్ వద్ధకు వచ్చేలా చర్యలు చేపట్టాలని కోరారు.ఈ కార్యక్ర మంలో తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీఓ నారాయణ, జయంపు సొసైటీ అధ్యక్షులు సింగంశెట్టి భాస్కర్ రావు, సీసీ నాయుడు,మండల పార్టీ అధ్యక్షులు రాయి సత్యనారాయణ, మాజీ మండల పార్టీ అధ్యక్షులు రాయి మస్తాన్ నాయుడు, దాసరి రాజగోపాల్ నాయుడు, భైరవరం సొసైటీ అధ్యక్షులు దాసరి ప్రభాకర్ నాయుడు, క్లస్టర్ ఇన్చార్జి కూను శ్రీహరి, బద్వేల్ కళ్యాణ్ రెడ్డి, మల్లెమాల గోపికృష్ణారెడ్డి, బట్టేపాటి మురళీమోహన్ రెడ్డి, తాళ్లూరు ప్రసాద్ నాయుడు, ముప్పాళ్ల మాధవనాయుడు, చిత్తూరు ఈశ్వరయ్య, మద్దూరు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. పోటో:-మాట్లాడుతున్న ఎమ్మెల్యే
పోటో:-పరిశీలిస్తున్న దృశ్యం