జానపద కళాకారుల గుర్తింపు కార్డుల దరఖాస్తులకు ఆహ్వానం

డప్పు సతీష్ అమరవరపు

సాక్షి డిజిటల్ న్యూస్ సెప్టెంబర్ 3 యారవ సురేష్ గరేడేపల్లి మండలం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ తరపున జానపద కళాకారులకు గుర్తింపు కార్డులు జారీచేయడం మొదలైందని. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం అప్పన్నపేట గ్రామానికి చెందిన సతీష్ మ్యూజిక్ అకాడమీ డైరెక్టర్ అమరవరపు సతీష్ ఒక ప్రకటనలో తెలిపారు. సూర్యాపేట జిల్లా లో అర్హులైన జానపద కళాకారులూ అందరు tgdtculture.com వెబ్సైట్ ద్వారా సంబంధిత పత్రాలతో ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని అమరవరపు సతీష్ కోరారు. ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకున్న అనంతరం ప్రతి కళాకారుడికి గుర్తింపు కార్డు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని జానపద కళాకారులూ అందరు సద్వినియోగం చేసుకోవాలని అమరవరపు సతీష్ కోరారు.