దమ్మన్నపేట్ అభివృద్ధికి రూ.5 లక్షల ఎస్‌డీఎఫ్ నిధులు

ఎమ్మెల్యే భూపతిరెడ్డిని కలిసిన కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు గుండ్ల మోహన్

సాక్షి డిజిటల్ న్యూస్ సెప్టెంబర్ 03 ధర్పల్లి మండల రిపోర్టర్ సురేందర్ ధర్పల్లి: మండలంలోని దమ్మన్నపేట్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులైన గుండ్ల మోహన్ తొలిసారి నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా దమ్మన్నపేట్ గ్రామంలో సీసీ రోడ్డు పనుల కోసం ఎస్‌డీఎఫ్ నిధుల నుంచి రూ.5 లక్షలు మంజూరు చేయడం పట్ల ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
గ్రామంలో మౌలిక వసతుల అభివృద్ధికి నిధులు కేటాయించడం పట్ల గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామ అభివృద్ధికి సహకరిస్తున్న నాయకులకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని గుండ్ల మోహన్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జిల్లా డీసీసీ ఉపాధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాల్ రాజ్, ధర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు గాదె నరేష్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దినకర్కు గుండ్ల మోహన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.