
సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ పూతలపట్టు నియోజకవర్గం చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం సెప్టెంబర్ 3. బంగారుపాలెం మండలం కరుడువారిపల్లి వైయస్సార్ విగ్రహం వద్ద నాయకులు పేదల కోసం చేపట్టిన ప్రతి సంక్షేమ పధకం చిరస్థాయిగా నిలిచిపోయింది -- మహానేతకు ఘనంగా నివాళి అర్పించిన పూతలపట్టు నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ ఎం సునీల్ కుమార్ వై.యస్ రాజశేఖర్ రెడ్డి 17వర్ధంతిని బంగారుపాళ్యం మండలం కరిడివారిపల్లె గ్రామం లో వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు ఆద్వర్యంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పూతలపట్టు నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ సునీల్ కుమార్! ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, జలయజ్ఞం, ఫీజు రీంబర్స్మెంట్ ఇలా ఎన్నో పథకాలు, బడి ఈడు పిల్లల నుండి పండు ముసలివారి వరకు సంక్షేమ సారధిగా పేదల ఎదుగుదలకు బాటలు వేసిన మహనీయుడు ఆ దివంగత నేత వై.యస్ రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. సంక్షేమ ప్రదాత, అభివృద్ధి విధాత, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి భౌతికంగా మనకు దూరం ఉన్నా, వారి ఆలోచనల ద్వారా, అందించిన అభివృద్ధి ద్వారా లబ్ది పొందిన ప్రతి ఒక్కరి చిరునవ్వులో ఎప్పటికి కలకాలం నిలిచి ఉంటారని కొనియాడిన డాక్టర్ సునీల్ కుమార్. ఈ సందర్భంగా మండల కన్వీనర్ పాలేరు రామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి, మాజీ జిల్లా పరిషత్ చైర్మెన్ ఎం.బి.కుమార్ రాజా,ఎం పిపి అమరావతి, వైస్ ఎంపిపి శిరీష్ రెడ్డి అంజలి ఘటించి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం లో సీనియర్ నాయకులు థామస్, దత్తాత్రేయ రెడ్డి,
రాష్ట్ర పంచాయతీ రాజ్ విభాగం ప్రధాన కార్యదర్శి ప్రకాష్ రెడ్డి, రాష్ట్ర సోషల్ మీడియా సంయుక్త కార్యదర్శి కిషోర్ కుమార్ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ విభాగం కార్యదర్శి సర్దార్, బీసీ సెల్ మండల ప్రెసిడెంట్ ముగిలేశ్వర్ కరుడువారిపల్లి సర్పంచ్ రాజేష్ మరియు బాబు తదితరులు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.