నేరేడుచర్లలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు.

జనసేన పార్టీ నాయకులు సరికొప్పుల నాగేశ్వరరావు.

సాక్షి డిజిటల్ న్యూస్ సెప్టెంబర్ 3 యారవ సురేష్ నెరేడుచెర్ల మండలం: జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను బుధవారం నేరేడుచర్లలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. తెలంగాణలో జనసేన పార్టీ తొలి కౌన్సిలర్ సరికొప్పుల విజయలక్ష్మి–నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి చిన్నారులు, అభిమానులకు అల్పాహారం పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సరికొప్పుల నాగేశ్వరరావు మాట్లాడుతూ. పవన్ కళ్యాణ్ ఆశయాలు, ప్రజాసేవా స్ఫూర్తితో ప్రతి కార్యకర్త ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేయాలని పిలుపునిచ్చారు. యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన పార్టీ మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కొమ్మరాజుశ్రీను, అంజి, రాకేష్, శ్రీకాంత్, రవి, వెంకన్న, అర్జున్, సాయి చరణ్, నాగ చారి, మచ్చ పవన్ కళ్యాణ్, పాషా జనసేన నాయకులు, కార్యకర్తలు పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొన్నారు.