సాక్షి డివిజన్ న్యూస్ సెప్టెంబర్ 3 కోదాడ నియోజకవర్గం మునగాల మండలం రిపోర్టర్ (షేక్ మీరా) జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని కోదాడ పట్టణంలోని శ్రీ శనగల రాధాకృష్ణ సేవా సంస్థలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సేవా సంస్థలోని వారికి అన్నదానం చేశారు. పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమం నిర్వహించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్తికేయ శర్మ, భరత్ తదితరులు పాల్గొన్నారు.