పవన్ కళ్యాణ్ జన్మ దినంగా పరిమి భువనేశ్వరి బారీ ర్యాలీ వైద్య శిబిరం నిర్వహణ.

సాక్షి డిజిటల్ న్యూస్, భీమిలి రిపోర్టర్ (బోయి అప్పలరెడ్డి) సెప్టెంబర్ 3: డిప్యూటీ సీ.ఏం పవన్ కళ్యాణ్ జన్మ దినం పురస్కరించుకుని తగరపువలస 1వార్డు ప్రెసిడెంట్ పరిమి భువనేశ్వరి పార్టీ కార్యకర్తలతో బారీ ర్యాలీ నిర్వహించారు.పరిమి రవికుమార్ ప్రీతంకృష్ణ ఆధ్వర్యంలో పుర విధుల్లో పార్టీ జెండాలతో ర్యాలీ చేశారు. తగరపువలస జంక్షన్ లో డెంటల్ క్యాంప్ నిర్వహించి పేదలకు సహాయం అందించారు. పవన్ కళ్యాణ్ జన్మ దినం గుర్తుగా నాలుగు పాఠశాలకు సరస్వతి విగ్రహాలు బహుకరించి దండలు వేసారు.ఈ సందర్భంగా పరిమి భువనేశ్వరి మాట్లాడుతూ పార్టీ అధినేత జన్మదినం పేద వర్గాలకు సేవ దినంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు.