పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు

సాక్షి డిజిటల్ న్యూస్, సెప్టెంబర్ 3 చొప్పదండి నియోజకవర్గం రిపోర్టర్ కొండూరి సురేష్; చొప్పదండి నియోజకవర్గం లోని గంగాధర మండలం మధురనగర్ చౌరస్తా లో జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జనసేన పార్టీ సీనియర్ నాయకులు మొగిలిపాలెం రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా అంబేద్కర్ విగ్రహానికి జనసేన వీర మహిళా భారతి తో పూల మాల వేయించారు. అలాగే కేక్ కటింగ్ నిర్వహించి, రోగులకు పండ్లు పంపిణి చేశారు. దేశారాజపల్లి అనాధ ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రమేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి జనసేన పార్టీ పేద ప్రజలకు సేవ చేయడానికి పెట్టిన పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి సీనియర్ నాయకులు గొంటి సంజీవ్ కుమార్,మల్యాల మండల నాయకులు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.