
సాక్షి డిజిటల్ న్యూస్ – దేవీపట్నం, సెప్టెంబర్ 3: కె ప్రకాశరావు. జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని దేవీపట్నం మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. దేవీపట్నం మండల అధ్యక్షుడు చారపు వెంకటరాయుడు ఆధ్వర్యంలో రంపచోడవరం నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ వైద్యశాలలో బుధవారం ఈ కార్యక్రమం జరిగింది. పవన్ కళ్యాణ్ ఆశయస్ఫూర్తితో సేవా కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూ జనసైనికులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అన్ని దానాలకన్నా రక్తదానం మిన్న అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా పలువురి ప్రాణాలను కాపాడేందుకు ఉపయోగపడే రక్తాన్ని సేకరించారు. జన్మదిన వేడుకలను కేవలం సంబరాలకే పరిమితం చేయకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సూర్యప్రకాశ్, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ స్పందన, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు కాకి స్వామి పాల్గొన్నారు.రక్తదానం చేసిన వారిలో కొమరం దొరబాబు, కారం దుర్గాప్రసాద్ దొర, కొండ్ల సురేష్‌రెడ్డి, మలేష్, అంజిబాబు, కారం శివయ్యదొర, కారం సుధీర్‌కుమార్, తుర్రం సత్తిబాబు, వంగ దుర్గాప్రసాద్, కలం బుజ్జిబాబు, యట్ల రామకిరణ్‌రెడ్డి, పొలూజు చక్రరావు, పొలూజు సుబ్బారావు, పోసి బాబు, రమేష్, సిద్దు తదితర జనసైనికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు చారపు వెంకటరాయుడు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారికి అండగా నిలవడం ఎంతో సంతృప్తినిచ్చే కార్యక్రమమని అన్నారు. జనసేన అధినేత ఆశయాలను ముందుకు తీసుకెళ్లేలా భవిష్యత్‌లోనూ మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.