పెదంకాలం సాగునీటి ప్రాజెక్ట్ క్రింద వున్న ఆయకట్టు రైతులు మరియు ప్రజా ప్రతినిధులు అందరికీ ముఖ్య విన్నపం.

సాక్షి డిజిటల్ న్యూస్ / 3 పార్వతీపురం మన్యం,బలిజిపేట మండలం, రిపోర్టర్ B.దుర్గారావు: పెదంకాలం సాగునీటి ప్రాజెక్ట్ క్రింద వున్న ఆయకట్టు రైతులు మరియు ప్రజా ప్రతినిధులు అందరికీ ముఖ్య విన్నపం ప్రస్తుత తీవ్ర లినినో మరియు తీవ్ర వర్షా భావ పరిస్థితుల దృష్ట్యా ప్రాజెక్టు క్రింద వున్న పంటలకు సాగునీటి అవసరాలకు, చిట్ట చివరి ఆయకట్టు కు సాగునీరు అందించే క్రమంలో "వారబంధీ ప్రణాళిక" ( చివరి ఆయికట్టుకు సైతం నీరు అందించే ప్రక్రియ) లో భాగంగా వారంలో మూడు రోజులు ప్రాజెక్ట్ చివరి ప్రాంత రైతులకు సాగునీరు సరఫరా చేయుటకు మిగిలిన నాలుగు రోజులు ప్రాజెక్ట్ ఎగువ ప్రాంత రైతులకు సాగునీరు సరఫరా చేయుటకు గాను ఇరిగేషన్, సాగునీటి సంఘాలు,రెవెన్యూ, వ్యవసాయ, మరియు పోలీసు శాఖ వారి సమన్వయంతో సాగునీటి ప్రణాళిక నిర్వహించుటకు ఆయకట్టు రైతులు అందరు సహకరించగలరు అని కోరడమైనది. పై ప్రణాళిక లో భాగంగా బుధవారం, గురువారం మరియు శుక్రవారం (3 రోజులు ) ప్రాజెక్ట్ దిగువున వున్న రైతులు అదే విధముగా మిగిలిన 4 రోజులు ప్రాజెక్ట్ ఎగువున వున్న రైతులు సాగునీటిని వినియోగించుకోవాల్సిందాగా కోరడమైనది. ఆయకట్టు రైతులందరూ పైన తెలిపిన రోజులలో మీకు కేటాయించిన సాగునీటిని వృధా చేయకుండా సక్రమంగా వాడుకొని వారబంది ప్రణాళికను విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో బలిజిపేట మండలంలోని ప్రాజెక్టు కింద ఉన్న రైతులందరూ మీ యొక్క సహాయ సహకారాలు అందించి సమన్వయంతో సాగునీటిని వృధా చేయకుండా వాడుకొని చట్టచివరి ఆయకట్టు రైతులను ఆదుకోవాల్సిందిగా కోరడమైనది. ఈ సమాచారాన్ని అందరికి చేరేలా తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజాప్రతినిధులను ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులను యావన్మందిని కోరడమైనది. ఆంధ్రప్రదేశ్ - నీటిపారుదల వినియోగం మరియు ఆయకట్టు అభివృద్ధి శాఖ చట్టం 1984 సెక్షన్ 38 ప్రకారం సాగునీటి చౌర్యం, ఆయిల్ ఇంజిన్ వినియోగం, సాగునీటి కాలువల దురాక్రమణ మరియు అనాధికార పైపులు వినియోగం, అధికారుల విధులను అడ్డుకోవడం వంటి చర్యలు కు పాల్పడిన వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకొనబడును. ఇట్లు నీటిపారుదల శాఖ, లిజిపేట మండలం.