పేదల పెన్నిధి డాక్టర్ వైయస్సార్

కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మొక్క బిక్షపతి

సాక్షి డిజిటల్ న్యూస్ సెప్టెంబర్ 3 నడిగూడెం మండలం రిపోర్టర్ షేక్ రఫీ పేదల పెన్నిధి రైతు బాంధవుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని మండల పార్టీ అధ్యక్షుడు మొక్క బిక్షపతి అన్నారు.బుధవారం సిరిపురం గ్రామంలోని వైయస్సార్ 17వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల లేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ. ఆరోగ్యశ్రీ,108, ఫీజు రీయింబర్స్ మెంట్, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలతో పేదల సంక్షేమ ధ్యేయంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలు సంక్షేమ పథకాలు అమలుతో పాటు రైతు బాంధవుడుగా నిలిచి రైతును రాజును చేసిన ఘనత డాక్టర్ వైఎస్ఆర్ కే దక్కుతుందని తెలిపారు. ఆయన ఆశయాల మేరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమం లో శెట్టి.సతీష్, పి.వీరయ్య, డి. శ్రీను జి కోటయ్య, తదితరులు పాల్గొన్నారు...