ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానేత వైఎస్సార్ వైసిపి నేత

నల్లా నరసింహమూర్తి

సాక్షి డిజిటల్ న్యూస్ సెప్టెంబర్ 3, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతినిధి జి శ్రీనివాసరావు ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలం పేదల పెన్నిధి. సంక్షేమ రథసారథి. దివంగత నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా కాట్రేనికోన ఉప్పు కాలవంతన వద్ద వైయస్సార్ విగ్రహానికి నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా నల్లా నరసింహమూర్తి మాట్లాడుతూ. వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, కార్మికులు, బలహీన వర్గాల సంక్షేమానికి ఆయన అమలు చేసిన పథకాలు ప్రజల జీవితాల్లో చెరగని ముద్ర వేశాయి. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, జలయజ్ఞం, ఉచిత విద్యుత్ వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలతో కోట్లాది కుటుంబాలకు వైఎస్సార్ అండగా నిలిచారు. ప్రజల కోసం నిరంతరం ఆలోచించిన మహానేతగా వైఎస్సార్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారు. అని అన్నారు. వైఎస్సార్ ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాట్రేనికోన జడ్పిటిసి సభ్యులు నేల కిషోర్ కుమార్, కాట్రేనికోన మండల ఎంపీపీ కోలాటి సత్యవతి సత్యం, కుండాలేశ్వరం ఎంపీటీసీ సభ్యులు అక్కల శ్రీధర్, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ రాష్ట్ర డైరెక్టర్ నల్లా బేబీ జానకి, కాట్రేనికోన మాజీ సర్పంచ్ గంటి వెంకట సుధాకర్ రావు, కాట్రేనికోన సొసైటీ మాజీ అధ్యక్షులు జగడం బాలయోగి, జిల్లా ప్రచార కార్యదర్శి మరియు సోషల్ మీడియా ఇంచార్జ్ సభ్యులు గిడ్ల శ్రీనివాసరావు, మాజీ వార్డ్ మెంబర్ నల్ల హరికిషోర్, కాట్రేనికోన మండల ఎస్సీ సెల్ కార్యదర్శి అయితాబత్తుల శ్రీనుబాబు, గుంటూరు గోపాలకృష్ణ, జననాట్యమండలి కార్యదర్శి నేలపాటి సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.