ప్ర‌జా సేవ‌కు జాతీయ గౌరవం బండోనిగూడ స‌ర్పంచ్ జెట్టా కుమార్‌కు భార‌తీయ స్పూర్తి సేవా ర‌త్న జాతీయ పుర‌స్కారం

పలువురు నాయకుల ప్రశంసలు ప్రజాసేవయే పరమావధిగా నీ రివిరామంగా ప్రజల సంక్షేమం కొరకు పాటుపడే వ్యక్తిత్వం గల ఏకైక వ్యక్తి జట్టకుమార్ :------మాజీ సర్పంచ్ జిల్లెల్ల వెంకట్ రెడ్డి

సాక్షి డిజిటల్ న్యూస్ నందిగమా రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరిధిలోగల బండనుగూడ గ్రామం సర్పంచ్..ప్రజాసేవ, గ్రామీణాభివృద్ధి, విద్య, యువత, సామాజిక చైతన్యం, సాంస్కృతిక రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న రంగారెడ్డి జిల్లా బండోనిగూడ గ్రామ స‌ర్పంచ్ జెట్టా కుమార్‌కు ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ‘భారతీయ స్ఫూర్తి సేవార‌త్న జాతీయ పుర‌స్కారం’ ల‌భించింది. హైద‌రాబాద్‌లోని తెలంగాణ సార‌స్వ‌త ప‌రిష‌త్ లో నిర్వ‌హించిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో ఈ జాతీయ అవార్డును జెట్టా కుమార్‌కు ప్ర‌దానo చేశారు. సమాజం పట్ల బాధ్యతతో పనిచేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేయడం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి తోడ్పడటం, యువతను సామాజిక సేవ వైపు ప్రోత్సహించడం, విద్యా, సాంస్కృతిక కార్యక్రమాలకు అండగా నిలవడం వంటి సేవా కార్యక్రమాలను గుర్తించి ఈ పురస్కారానికి ఆయనను ఎంపిక చేసినట్లు స్ఫూర్తి ఎన్జీవో నిర్వాహకులు తెలిపారు. సేవా స్ఫూర్తికి గుర్తింపు జెట్టా కుమార్ తన రాజీకీయ‌, సేవా ప్రయాణంలో ప్రజలతో మమేకమై పనిచేస్తూ అనేక సామాజిక కార్యక్రమాల్లో భాగస్వాముల‌య్యారు. ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి, విద్యార్థుల ప్రోత్సాహం, యువతలో నాయకత్వ లక్షణాల పెంపు, సామాజిక అవగాహన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాల్లో ఆయన చూపుతున్న చొరవకు గానూ ఇప్ప‌టికే ప‌లు ప్ర‌శంస‌లు, అవార్డులు సొంతం చేసుకున్నారు. ‘స‌మాజానికి మ‌నం ఏమిచ్చామ‌న్న‌దే మ‌న జీవితానికి అస‌లైన అర్ధం, ప‌ర‌మార్ధం’ అన్న భావ‌న‌తో ముందుకు సాగుతున్న జెట్టా కుమార్ కు ఈ అవార్డు మ‌రింత గుర్తింపును తీసుకొచ్చింది. ప్రజాసేవే పరమావధిగా.. భారతీయ స్ఫూర్తి సేవార‌త్న జాతీయ పుర‌స్కారం’ అందుకున్న సందర్భంగా జెట్టా కుమార్ మాట్లాడుతూ, ఈ గౌరవాన్ని తన వ్యక్తిగత విజయంగా కాకుండా తనతో కలిసి ప్రజాసేవలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ దక్కిన గుర్తింపుగా భావిస్తున్నానన్నారు. ప్రజల ఆశీస్సులు, అభిమానమే తనకు అతిపెద్ద బలమని తెలిపారు. “ఈ పురస్కారం నాకు మరింత బాధ్యతతో ముందుకెళ్లాల‌న్న విష‌యాన్ని గుర్తు చేసింద‌ని, ప్ర‌జ‌ల కోసం చేస్తున్న వివిధ సేవా కార్య‌క్ర‌మాల‌ను మ‌రించ విస్తృతంగా కొనసాగిస్తూ, అంద‌రికీ స్ఫూర్తిగా నిలిచే విధంగా ప‌నిచేయ‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని, స‌మాజానికి ఉప‌యోగ‌ప‌డే ప్ర‌తి కార్య‌క్ర‌మానికి త‌న వంతు స‌హాయ స‌హాకారాలు ఉంటాయ‌ని” ఈ సంద‌ర్భంగా ఆయ‌న పేర్కొన్నారు. జెట్టా కుమార్‌కు “భారతీయ స్ఫూర్తి సేవా రత్న” జాతీయ పురస్కారం లభించడంతో పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, ప్రముఖులు, కుటుంబ సభ్యులు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డు ప్ర‌దానోత్స‌వ కార్య‌క్ర‌మంలో స్ఫూర్తి ఎన్జీవో వ్య‌వ‌స్థాప‌కులు డాక్ట‌ర్ ఆకుల ర‌మేష్‌, స్ఫూర్తి స‌ర్వీసెస్ ప్ర‌ధాన స‌ల‌హాదారు డాక్ట‌ర్ గూడూరి చిన్నారెడ్డి, నిజాం కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ డాక్ట‌ర్ కుంట సురేష్ తదిత‌రులు పాల్గొన్నారు. సేవకు సత్కారం.. స్ఫూర్తికి సన్మానం జెట్టా కుమార్‌కు లభించిన “భారతీయ స్ఫూర్తి సేవా రత్న నేషనల్ అవార్డు” ఆయన సేవా ప్రస్థానంలో మరో ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. ప్రజాసేవ పట్ల ఆయనకున్న అంకితభావం, సేవా సంకల్పానికి ఈ పురస్కారం ప్రతీకగా నిలిచింది. అదే సమయంలో, భవిష్యత్తులో మరింత ఉత్సాహంతో, అంకితభావంతో సామాజిక సేవా కార్యక్రమాలను కొనసాగించేందుకు ఈ గౌరవం ఆయనకు కొత్త స్ఫూర్తిని అందించింది. ప్రజాసేవకు లభించిన ఈ గుర్తింపు కేవలం ఒక వ్యక్తికి దక్కిన అవార్డు మాత్రమే కాదు.. సేవా మార్గాన్ని ఎంచుకుని సమాజం కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న ప్రతి ఒక్కరికీ ఇది ఒక స్ఫూర్తిదాయక సందేశం. సమాజానికి మన వంతు సేవ చేయాలనే సంకల్పానికి గుర్తింపుతో పాటు, మరెందరో సేవా మార్గంలో ముందుకు సాగేందుకు ఈ పురస్కారం ప్రేరణగా నిలుస్తోంది.