ప్రభాకర్ చొరవతో 9వ వార్డు అభివృద్ధి -వార్డు ప్రజల హర్షధ్వానాలు

సాక్షి డిజిటల్ న్యూస్, సెప్టెంబర్ 03, సుల్తానాబాద్ రిపోర్టర్ తిరుకోవళ్లూరి సంజయ్ : తొర్రికొండ ప్రభాకర్ చొరవతో 9వ వార్డు అభివృద్ధి తారాస్తాయికి చేరుకుంది. గత పాలకుల 30 ఏళ్ల పాలనలో ఎవ్వరూచేయలేని అభివృద్ధి సుల్తానాబాద్ మున్సిపాలిటీ 9వ వార్డు పరిధిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆధ్వర్యంలో 9వ వార్డు కౌన్సిలర్ తొర్రికొండ ప్రభాకర్ పనులు పూర్తి చేసి ప్రజలకు అండగా నిలిచారు. ఈ మేరకు నూతన విద్యుత్ స్తంభాలు(పోల్స్)వేయించి, వాటికి సర్వీస్ వైర్లు వేయించి, వీధి దీపాలు(స్ట్రీట్ లైట్స్)వేయించారు. ఈ కార్యక్రమం తో ఆ వీధి లోని ప్రజల చిరకాల విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభాకర్ మాట్లాడుతూ నా హయాంలో 9వ వార్డును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సహకారంతో కనీ వినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేసి చూపిస్తానని హామీ ఇచ్చారు.