ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుదలే లక్ష్యం

★సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్

సాక్షి డిజిటల్ న్యూస్ సెప్టెంబర్ 03 సూర్యాపేట ప్రతినిధి బాణోతు రామకృష్ణ ​సూర్యాపేట జిల్లా విద్యాశాఖ అధికారులతో కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ పలు కీలక ఆదేశాలు జారీ చేశారు 70% లెర్నింగ్ టార్గెట్ విద్యార్థులు కనీసం 70% అభ్యాసన సామర్థ్యాలు సాధించేలా ప్రత్యేక ప్రణాళికలు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి.డిజిటల్ లెర్నింగ్ ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వాలా వంటి ప్లాట్‌ఫామ్‌లలో విద్యార్థుల 100% నమోదు.ఫేషియల్ అటెండెన్స్ విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు 90% తగ్గకుండా ఉండాలి.హరిత పాఠశాలలు "స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ"లో భాగంగా 15 రోజుల్లో పాఠశాలల్లో ఔషధ మొక్కల పెంపకం.ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు టాస్(10వ, ఇంటర్) ప్రవేశాల గడువు ఈ నెల 15 వరకు పొడిగింపు.బాలికల ఆరోగ్యం 44 కేజీబీవీ, రెసిడెన్షియల్ హాస్టళ్లలో శానిటరీ న్యాప్‌కిన్ ఇన్‌సినరేటర్ల ఏర్పాటు.పాఠశాల సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ ఈమెయిల్ :collector Suryapet@gmail.com ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి అశోక్, వివిధ విభాగాల సెక్టోరల్ అధికారులు, డిఆర్డిఏ అధికారి సన్యాసయ్య, ట్రైనీ కలెక్టర్లు రవితేజ, అనుష, ఎఫ్‌ఎల్‌ఎన్ రాష్ట్ర కోఆర్డినేటర్ అభిషేక్ శ్రావణ్ కుమార్ హరికృష్ణ పూలన్ సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.