ప్రభుత్వ హామీల విఫలంపై బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా

సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ గాజుల శ్రీనివాస్ గౌడ్ సెప్టెంబర్ 03/09/2026 వెల్గటూర్ మండలం తెలంగాణ రాష్ట్రంలో అమలుకు సాధ్యం కానీ మోసపూరితమైన హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో పూర్తిగా విఫలమై ప్రజలకు మొండి "చేయి" చూపిందని రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. బుధవారం ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో హామీల ప్రకారంగా ప్రజలకు బాకీ పడిన సొమ్మును బాకీ కార్డులు ప్రచురించి పంపిణీ చేశారు, భారీ మొత్తంలో ధర్నా కార్యక్రమం నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆరు గ్యారంటీల పథకంలో ఫ్రీ బస్సు తప్ప మిగతా పథకాలు చేయూత పింఛన్ల పెంపు, 500 కే గ్యాస్ సిలిండర్, మహిళలకు నెలకు 2500, కళ్యాణ లక్ష్మి లో తులం బంగారం, రైతు బీమా, రైతు బంధు, పంట రుణమాఫీ, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్, తదితర హామీలు అన్నిటిని ప్రభుత్వం అటకెక్కించిందని వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎప్పటికప్పుడు సమర బేరి మోగించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ మాజీ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, వెల్గటూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్ పర్సన్ లు గుండాటి గోపిక -జితేందర్ రెడ్డి, పత్తిపాక వెంకటేష్, ధర్మపురి మున్సిపల్ మాజీ చైర్మన్ సంగి సత్తెమ్మ, నాయకులు ముత్యాల బలరాం రెడ్డి, పూస్కురి జితేందర్ రావు, మారం జలంధర్ రెడ్డి, అయ్యోరి రాజేష్, సింహాచలం జగన్, చిలువేరి శ్యాంసుందర్, చల్లూరి రాంచంద్రంగౌడ్, గోస్కుల జలంధర్, లోక మల్లారెడ్డి, కాంపెల్లి హనుమాండ్లు, దండవేని గంగమల్లు యాదవ్, జూపాక కుమార్, మూగల సత్యం, గాజుల మల్లేశం, గుర్రం మోహన్ రెడ్డి, రాచూరి శ్రీధర్, మారం జగన్మోహన్ రెడ్డి, బి ఆర్ ఎస్ సీనియర్ నాయకుడు ధ్యావనపెల్లి ఎల్లయ్య మేరుగు జానీ, గాలిపెల్లి సత్తయ్య, చిందం తిరుపతి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.