బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించిన మహోన్నత నేత డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి.

★డిసిఎంఎస్ మాజీ ఛైర్మన్ కొత్వాల.

సాక్షి డిజిటల్ న్యూస్: 03 సెప్టెంబర్, పాల్వంచ. రిపోర్టర్: కె.జానకిరామ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ మండల కేంద్రంలో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాల్వంచలో బుధవారం వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు. పాల్వంచ మరియు భద్రాచలం రోడ్డులోని పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న వై.ఎస్. విగ్రహానికి కొత్వాలతో పాటు కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన ఘనత వై.ఎస్ రాజశేఖర్ రెడ్డిదే అని అన్నారు. పేద విద్యార్థుల చదువుల కోసం ఫీజు రీయింబర్స్ మెంట్, పేదవారి ఆరోగ్యం కోసం ఆరోగ్యశ్రీ పథకం, రైతు శ్రేయస్సు కోసం ఒకే దఫా రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత వై.ఎస్ దే అని కొత్వాల అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కాల్వ భాస్కర్ రావు, కాంగ్రెస్ నాయకులు యర్రంశెట్టి ముత్తయ్య, కొండం వెంకన్న గౌడ్, పైడిపల్లి మహేష్, సాదం రామకృష్ణారావు, ఎస్.వి.ఆర్.కె. ఆచార్యులు, కొత్తపల్లి సోమయ్య, కాపర్తి వెంకటాచారి, డిష్ నాగేశ్వరరావు, కటుకూరి శేఖర్, కోమర్రాజు విజయ్, వజ్జల రాము, వాలపల్లి రాంబాబు, సందు ప్రభాకర్, పాకాలపాటి రోశయ్య చౌదరి,చెన్నూరు రాము, కొత్తపల్లి రవి, బొందిల బాలు, బూసి శ్రీను, యాటా నాని, కొండూరి లక్ష్మణ్, సాగర్, ధర్మరాజుల రమేష్, సంతోష్, దాసరి యాకయ్య, తదితరులు పాల్గొన్నారు.