బాలసదన్ సందర్శించిన జడ్జి శ్రీనిజ కోహిర్కర్

సాక్షి డిజిటల్ న్యూస్,సెప్టెంబర్ 03, సుల్తానాబాద్ రిపోర్టర్ తిరుకోవళ్లూరి సంజయ్ : పెద్దపల్లి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీనిజ కోహిర్కర్ బుధవారం సుల్తానాబాద్ లోని బాలసదన్, వృద్ధాశ్రమం, క్యాడర్ దివ్యాంగుల పాఠశాల సందర్శించి ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా జడ్జి శ్రీనిజ కోహిర్కర్ మానసిక వికలాంగుల చిన్నారులకు విద్య, వృత్తి తదితర అంశాలపై శిక్షణ ఇవ్వాలని అధికారులకు సూచించారు. భోజన సదుపాయాల, వసతుల గురించి ఆరా తీశారు. వృద్ధాశ్రమంలో వృద్ధులతో మాట్లాడి మాట్లాడి వారికి అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. సిబ్బందికి గదుల నిర్వహణ, స్వచ్ఛమైన తాగునీరు, పారిశుద్ధ్యం, భోజన సదుపాయాలకు ఎలాంటి లోటు రాకుండా చూడాలని సిబ్బందికి తెలిపారు. ఎవరికైనా ఎలాంటి ఇబ్బందులు ఉన్నట్టయితే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ దృష్టికి తీసుకువచ్చినట్టయితే ఆ సమస్యలను పరిష్కరించేందుకు తోడ్పడుతామని జడ్జి శ్రీనిజ కోహిర్కర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో క్యాడర్ సంస్థ జనరల్ సెక్రెటరీ గజ్జెల్లి సతీష్, పాఠశాల సిబ్బంది, వృద్ధాశ్రమం నిర్వాహకులు, బాలసదన్ సూపరింటెండెంట్, సిబ్బంది పాల్గొన్నారు