బీజేపీ లేబర్ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు తడగొండ నర్సయ్యకు ఘన సన్మానం

సాక్షి డివిజన్ న్యూస్ 03.09.26 (పెద్దపల్లి జిల్లా మెరుగు నరేష్ గౌడ్) జేపీ లేబర్ సెల్ (కార్మిక శాఖ) పెద్దపల్లి జిల్లా అధ్యక్షులుగా నియమితులైన తడగొండ నర్సయ్య ని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కందుల సంధ్యారాణి శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బీజేపీ మహిళా మోర్చా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు చిలుక భారతి, ఎస్సీ మోర్చా పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మచ్చ విశ్వాస్ బిజెపి పెద్దపల్లి జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు ఎల్తూరి సరితను కూడా శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ, పార్టీ అధిష్ఠానం తడగొండ నర్సయ్యకి అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. బీజేపీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు సులువ లక్ష్మీ నరసయ్య, జనగామ మండల అధ్యక్షులు గుండబోయిన భూమయ్య,అంతర్గాం మండల అధ్యక్షులు బోడకుంటి సుభాష్, పాలకుర్తి మండల అధ్యక్షుడు మెరుగు నరేష్ గౌడ్, లక్ష్మీనగర్ మండల అధ్యక్షులు ఊరగొండ అపర్ణ సులువ పద్మ, కోడూరు రమేష్, బియ్యాల మహేందర్,కొట్టే నరేష్, అందే రాజ్ కుమార్ చారి, శీతకారి గంగరాజు, జక్కుల ప్రవీణ్–పద్మ, ఎల్తూరి సరిత–రాజయ్య, పాకాల నరసింహారెడ్డి, హనుమాన్ల వెంకటేష్, అంకరి భరత్, బూడిద హర్ష, జక్కన బాలు, బుంగ మహేష్, జనగామ శివరాం, లింగాల శంకర్ తదితరులు పాల్గొన్నారు....