మద్యం సేవించి వాహనం నడిపిన ఇద్దరికి వారం రోజుల జైలు

సాక్షి డిజిటల్ న్యూస్ సెప్టెంబర్ 03 ధర్పల్లి మండల్ రిపోర్టర్ సురేందర్ ధర్పల్లి: మద్యం సేవించి వాహనాలు నడుపుతూ వాహన తనిఖీల్లో పట్టుబడిన చింత సాయికుమార్, గంగాధర్‌లపై ధర్పల్లి పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు నమోదు చేశారు. అనంతరం వారిని గౌరవ సెకండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ నూర్జహాన్‌ ఎదుట హాజరుపరచగా, ఇద్దరికీ వారం రోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్‌ఐ జి. సందీప్‌ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని, వాహనదారులు నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా ప్రయాణించాలని పోలీసులు సూచించారు.