
సాక్షి, డిజిటల్ న్యూస్ మరికల్, సెప్టెంబర్ 3,(రిపోర్టర్ ఇమామ్ ), నారాయణపేట జిల్లాలో బీజేపీ పార్టీ మరికల్ మండల కిసాన్ మోర్చా అధ్యక్షునిగా నరేష్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా నరేష్ గౌడ్ మాట్లాడుతూ బిజెపి పార్టీ బలోపటానికి కృషి చేస్తానన్నారు. మరికల్ మండలంలోని ప్రతి గ్రామంలో ఉన్న రైతుల సమస్యలను దశలవారీగా పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. అనంతరం పార్టీ కార్యకర్తలు శాలువాల తో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షుడు మంగలి వేణుగోపాల్, భాస్కర్ రెడ్డి, రమేష్, సురేందర్, రాజేష్,నరేష్ గౌడ్, మధు, అశోక్, జగదీష్, నాగేష్, గంగాధర్, రాజు, మహేష్, శివ, నరేష్, దేవేందర్ గౌడ్, సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.