మల్లాపూర్‌లో వి.బీ.జీ రామ్ జీ గ్రామసభ

సాక్షి డిజిటల్ న్యూస్, సెప్టెంబర్ 3, మల్లాపూర్ మండల రిపోర్టర్ ఆకుతోట నర్సయ్య : మల్లాపూర్ మండల కేంద్రంలో వికసిత్ భారత్–జీ రామ్ జీ (వి.బీ.జీ రామ్ జీ) గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న పలు సమస్యలపై గ్రామసభలో చర్చించారు. గ్రామంలో సీసీ రోడ్డు పనులు చేపట్టడంతో పాటు కోతుల బెడదను నివారించాలని సామాజిక కార్యకర్త ఏనుగు వెంకట్ రెడ్డి కోరారు. గ్రామంలో కోతుల సమస్య తీవ్రంగా ఉందని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ మాట్లాడుతూ, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టం ద్వారా ప్రతి గ్రామీణ కుటుంబానికి ఏడాదికి ఉపాధి హామీ పనిదినాలను 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచినట్లు తెలిపారు. కోతుల సమస్యపై కూడా సానుకూలంగా స్పందించి, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గడ్డం సోమ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి గూరుడు శ్రీనివాస్, వార్డు సభ్యులు ముష్కరి రమేష్, అరికుప్పల రాజం, ఎనుగంటి నరేష్, ముత్యాల గంగారాజం, కొంపెల్లి రాకేష్, కదుర్కపు లక్ష్మి–రాజేందర్, కాషవత్తుల లక్ష్మి–రాజేందర్, మొరపు లక్ష్మి–గంగారాజం, ఏనుగు లక్ష్మి–వెంకట్ రెడ్డి, శనిగారపు లావణ్య–నరేష్, అల్లె లత–చంద్రయ్య, అలాగే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మాట్ల సోమయ్య, నాయకులు పూండ్ర లక్ష్మా రెడ్డి, గడ్డం శ్రీనివాస్ రెడ్డి, కోటగిరి ఆనంద్ గౌడ్, మరిపెల్లి మల్లయ్య, పెద్దిరెడ్డి లక్ష్మణ్, ఉయ్యాల లక్ష్మణ్, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.