మల్లెపల్లిలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ఎమ్మెల్యే కుంభం

సాక్షి డిజిటల్ న్యూస్ / 03 సెప్టెంబర్ / రిపోర్టర్ కుమారస్వామి వలిగొండ మండల పరిధిలోని మల్లేపల్లి గ్రామంలో భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి బుధవారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.రూ.40 లక్షల నిధులతో నిర్మించిన డ్రైనేజ్.10 లక్షల నిధులతో నిర్మించిన సీసీ రోడ్డు పనులు పూర్తికావడంతో వాటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు.అదేవిధంగా రూ.10 లక్షల నిధులతో నిర్మించనున్న మహిళా శక్తి భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా సంఘం సభ్యులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.