
సాక్షి డిజిటల్ న్యూస్, సెప్టెంబర్ 3 చొప్పదండి నియోజకవర్గం రిపోర్టర్ కొండూరి సురేష్; జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన చేసిన సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోగూరీ నాగ భూషణ్ రెడ్డి, కొడిమ్యాల సర్పంచ్ గడ్డం జీవన్ రెడ్డి, ముత్యం శంకర్, కొండూరి రాజేష్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.