
(సాక్షి డిజిటల్ న్యూస్) సెప్టెంబర్ 3 మెట్‌పల్లి పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రుల్లో జిల్లా ఉప వైద్య ఆరోగ్య అధికారి డా. ముస్కు జైపాల్ రెడ్డి బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.సూర్య హాస్పిటల్‌లో అర్హత లేని వైద్యుడితో (ఈ ఎన్ టి) స్పెషలిస్ట్‌గా వైద్య సేవలు అందిస్తున్నారనే ఫిర్యాదుల మేరకు తనిఖీ చేపట్టారు. వైద్యుల విద్యార్హతలు, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్, ఆస్పత్రి రికార్డులను పరిశీలించారు.తనిఖీలో గుర్తించిన అంశాల ఆధారంగా సూర్య హాస్పిటల్ యాజమాన్యానికి షోకాజ్ నోటీసు జారీ చేసి నిర్ణీత గడువులో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. వివరణ అనంతరం క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.అనంతరం పట్టణంలోని ఇతర ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ తనిఖీలు చేసి క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం అమలును పరిశీలించారు. నమోదిత, అర్హత కలిగిన వైద్యులతోనే సేవలు అందించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని డా" జైపాల్ రెడ్డి హెచ్చరించారు.వీరి వెంట మండల వైద్య అధికారి డా" అంజిత్ రెడ్డి పాల్గొన్నారు.