యాదవ సంఘం నూతన అధ్యక్షుడిగా అల్లంల దేవేందర్

సాక్షి డిజిటల్ న్యూస్, సెప్టెంబర్ 3, కాల్వ శ్రీరాంపూర్: యాదవ్ ఏకగ్రీవ ఎన్నికకాల్వ శ్రీరాంపూర్, సెప్టెంబర్ 2: మండల యాదవ సంఘం నూతన అధ్యక్షుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బుధవారం మండల కేంద్రంలోని ఆర్‌ఆర్‌ బంక్విట్ హాల్‌లో కాల్వ శ్రీరాంపూర్ మండల యాదవుల ఎన్నికల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండల యాదవ సంఘం నూతన అధ్యక్షుడిగా శ్రీ అల్లంల దేవేందర్ యాదవ్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘం ప్రతినిధులు ప్రకటించారు.తన ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికీ నూతన అధ్యక్షుడు అల్లంల దేవేందర్ యాదవ్ పేరుపేరునా ప్రత్యేక కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలియజేశారు.ముఖ్యంగా యాదవ సంఘం నాయకులు సందనవేన రాజేందర్ యాదవ్మాజీ మండలాధ్యక్షుడు గాజనవేన సదయ్య యాదవ్గొడుగు రాజ కొమురయ్య యాదవ్పర్ష బక్కన్న యాదవ్తాత రాజు యాదవ్పెగడ రమేష్ యాదవ్మాజీ ఎంపీపీ నూనెటి సంపత్ యాదవ్మాజీ జెడ్పిటిసి గంట రాములు యాదవ్యాదవ సంఘం జిల్లా మహిళా అధ్యక్షురాలు సల్పాల సుమలత-మహేందర్ యాదవ్వీరితో పాటు వివిధ గ్రామాల యాదవ సంఘం అధ్యక్షులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, మిత్రులు, శ్రేయోభిలాషులు మరియు సమస్త యాదవ కుల బంధువులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. యాదవ సంఘం బలోపేతానికి, కుల బాంధవుల శ్రేయస్సుకు తన శాయశక్తులా కృషి చేస్తానని ఈ సందర్భంగా దేవేందర్ యాదవ్ పేర్కొన్నారు.