విద్యుత్ భద్రతపై అవగాహన ర్యాలీ

సాక్షి డిజిటల్ న్యూస్ సిహెచ్ ప్రసాద్ రావు రిపోర్టర్ పార్వతీపురం మన్యం జిల్లా. 3/9/26 పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో విద్యుత్ భద్రతపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పర్యవేక్షణ ఇంజనీర్ ఆపరేషన్ సర్కిల్ పెద్దింటి త్రినాధరావు ఆధ్వర్యంలో జరిగింది. ముఖ్యంగా విద్యుత్ భద్రతపై అవగాహన ర్యాలీ కార్యక్రమంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తడిచేతులతో ముట్టుకోరాదని. మరియు కరెంటు ఎంత ఉపయోగకరమో అంతే హానికరమని నినాదాలు చేస్తూ ర్యాలీ కార్యక్రమం చేపట్టారు. ముఖ్యంగా సేఫ్టీ పరికరాలతో కరెంటును పట్టుకోవాలని లేనిపక్షంలో ప్రాణానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని నినాదాలు చేస్తూ ర్యాలీ కార్యక్రమం ఎలక్ట్రికల్ ఆఫీస్ నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎలక్ట్రికల్ సిబ్బంది, మరియు లైన్మెన్లు ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్నారు.