
సాక్షి డివిజన్ న్యూస్ మంచిర్యాల్ జిల్లా బ్యూరో ఎండి యూసుఫ్ సెప్టెంబర్ 3 మంచిర్యాల జిల్లా లోని బెల్లంపల్లి యూనియన్ బ్యాంక్ కార్యాలయం ఎదుట సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు యూనియన్ బ్యాంకు లో ఖాతాలు కలిగి ఉన్న 70 సంవత్సరాల లోపు కోల్ మైన్స్ పెన్షన్ దారులకు 30 లక్షల ప్రమాద భీమా సౌకర్యం యూనియన్ బ్యాంకు అధికారులు కలిపియానందుకు నిరసన గా సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జ్ లు ధరించి యూనియన్ బ్యాంక్ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం తో యూనియన్ బ్యాంక్ చేసుకున్న ఒప్పందం మేరకు 2024 ఫిబ్రవరి 26 నుండి యూనియన్ బ్యాంక్ లో ఖాతాలు కలిగి ఉన్న కోల్ మైన్స్ పెన్షన్ దారులకు 30 లక్షల ప్రమాద భీమా సౌకర్యం కల్పించాల్సిన యూనియన్ బ్యాంకు అధికారులు పెన్షన్ దారుల పట్ల నిర్లక్ష్య ధోరణిని అవిలంభిస్తున్నారని సింగరేణి విశ్రాంత ఉద్యోగుల పెన్షన్ దారుల వ్యతిరేక విధానాలను యూనియన్ బ్యాంక్ అధికారులు విడనాడాలని 2024 లో చేసుకున్న ఒప్పందం మేరకు 70 సంవత్సరాల లోపల పెన్షన్ దారులకు వెంటనే 30 లక్షల ప్రమాద భీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేసినారు. లేని ఎడల విశ్రాంత సింగరేణి ఉద్యోగులతో పాటు పెన్షన్ దారుల కుటుంబాలతో యూనియన్ బ్యాంక్ కార్యాలయాల ముందు పెద్ద ఎత్తున నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని యూనియన్ బ్యాంకు అధికారులకు తెలియజేశారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి యూనియన్ బ్యాంక్ మేనేజర్ కు వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు గజెల్లి వెంకటయ్య, ఉపాధ్యక్షులు ఎన్ సదాశివ్ , నాయకులు పేరాల రాయమల్లు , బింగి పోషం , బొట్ల కృష్ణస్వామి , భాషవోయిన పోతరాజు , దాసి సదానందం , అక్కల దుర్గయ్య , కె తిరుపతి , జే నాగేశ్వర్ రావు , కె గురుస్వామి , డి రవీందర్ , ఎం కృష్ణమూర్తి , ఎం వెంకటి , పెద్దపల్లి లక్ష్మయ్య , అచ్చ వెంకటేశం , బి రాజనర్సు , దాసు సదానందం , ఎస్ సత్యనారాయణ , ఆర్ ఎం సింగడే , డి దేవయ్య , ఎం లక్ష్మయ్య , మెరుగు నర్సింహస్వామి , గట్టు రాజయ్య, భ్రమం తదితరులు పాల్గొన్నారు.