
సాక్షి డిజిటల్ న్యూస్ సెప్టెంబర్ 3, 2026 మేడ్చల్ మల్కాజ్గిరి రిపోర్టర్ చంద్రశేఖర్ ఉప్పల్ ఎక్స్ రోడ్లో కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల పాలన వైఫల్యాలు, అమలు కాని హామీలపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొని ప్రభుత్వ తీరుపై తీవ్రంగా. విమర్శించారు. గాడిదలతో వినూత్న నిరసన చేపట్టి ప్రభుత్వ హామీలపై ఎద్దేవా చేశారు.420 అడుగుల భారీ బ్యానర్‌ను ప్రదర్శించి నిరసన వ్యక్తం చేశారు.బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ నిరంతరం పోరాడుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.హామీలు అమలు చేసే వరకు ప్రభుత్వంపై ఒత్తిడి కొనసాగిస్తామని తెలిపారు.నిరుద్యోగులు, రైతులు, మహిళలు, పేదల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు.ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడతామని నాయకులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మల్కాజ్గిరి ఇన్చార్జి రాగిడి లక్ష్మారెడ్డి,.మాజీ కార్పొరేటర్లు, డివిజన్ నాయకులు, మహిళా కార్యకర్తలు, పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చారు.