వెలదికొత్తపాలెం లోఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న

మండలం టిడిపి యూనిట్ ఇన్చార్జి కొల్లి రామారావు

సాక్షి డిజిటల్ న్యూస్ నందిగామ నియోజకవర్గ ప్రతినిధి కొప్పుల వెంకట్రావు.. సెప్టెంబర్ 3.09.2026 చందర్లపాడు మండలం వెలదికొత్తపాలెం గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి యూనిట్ ఇంచార్జ్ కొల్లి రామారావు, అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ నగదు అందజేశారు. ఈ సందర్భంగా కొల్లి రామారావు మాట్లాడుతూ గ్రామంలోని ప్రతి అర్హుడికి సకాలంలో పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు నున్న వెంకటగిరి, టిడిపి సీనియర్ నాయకులు, సచివాలయ సిబ్బంది, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు,పెన్షన్ లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.