
సాక్షి డిజిటల్ న్యూస్, ఎల్.బి. నగర్ నియోజకవర్గం ఇంచార్జి, సెప్టెంబర్ 3. రిపోర్టర్: ఎం.దుర్గా ప్రసాద్. దివంగత మాజీ ముఖ్యమంత్రి, మహానేత డా.వై.ఎస్. రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా టీపీసీసీ అధికార ప్రతినిధి దరిపల్లి రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కర్మన్‌ఘాట్‌లోని క్రాంతి క్లబ్ సమీపంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దరిపల్లి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. పేదలు, రైతులు, విద్యార్థులు, మహిళల సంక్షేమం కోసం డా. వై.ఎస్. రాజశేఖర రెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని అన్నారు. వైఎస్సార్ అందించిన ప్రజా సంక్షేమ పాలన, ఆయన సేవలు, ఆశయాలు నేటి తరానికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ప్రజల కోసం నిరంతరం కృషి చేసిన మహానేత వైఎస్సార్‌ను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ఆయన అన్నారు. జోహార్ వైఎస్సార్! జోహార్ రాజన్న!.