వైఎస్సార్ సేవలు చిరస్మరణీయం.

సొసైటీ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్.

సాక్షి డిజిటల్ న్యూస్ సెప్టెంబర్ 3 మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం (రిపోర్టర్ వల్లపుదాసు వెంకటేశ్వర్లు) గార్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని గార్ల బస్టాండ్ సెంటర్‌లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఆయనకు ఘన నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో గార్ల సొసైటీ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్, గార్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాళ్లపల్లి కృష్ణ గౌడ్, గార్ల మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ భానోత్ పార్వతీ హతిరామ్ నాయక్, ఇల్లందు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ భూక్య నాగేశ్వరరావు తదితరులు పాల్గొని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ వడ్లమూడి దుర్గాప్రసాద్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో పేదలు, రైతులు, మహిళలు, విద్యార్థులు, కార్మికులు, బలహీన వర్గాల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు అమలు చేశారని గుర్తు చేశారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమన్వయం చేస్తూ ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి వైఎస్సార్ చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు. ప్రత్యేకించి పేద ప్రజలకు వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ, రైతులకు అండగా నిలిచే విధానాలు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, మహిళల సంక్షేమం వంటి పలు కార్యక్రమాల ద్వారా ఆయన ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని కొనియాడారు. తెలుగు ప్రజల గుండెల్లో వైఎస్సార్ ఎప్పటికీ మహానేతగా నిలిచిపోతారని పేర్కొన్నారు. వైఎస్సార్ ఆశయాలను కొనసాగిస్తూ పేదలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని నాయకులు తెలిపారు. ఆయన వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ సేవలను స్మరించుకోవడం ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు గర్వకారణమని అన్నారు.
ఈ కార్యక్రమంలో మర్రిగూడెం సర్పంచ్ భూక్య రామ్‌సింగ్, గార్ల మేజర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ మహమ్మద్ జరీనా బేగం రహీం ఖాన్, షేక్ యాకూబ్ పాషా, బాబూలాల్, కోలా కుమార్ గౌడ్, దీకొండ రాము, నెహ్రూ, షేక్ ఉస్మాన్, మండా రవి గౌడ్, షేక్ మౌలానా, గుండ్లపల్లి నాగయ్య, సైజాద్, ముత్యం పూర్ణ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని డాక్టర్ వైఎస్సార్‌కు ఘన నివాళులు అర్పించారు.