వైఎస్సార్‌ 17వ వర్ధంతి.. మండల వ్యాప్తంగా ఘన నివాళు

సాక్షి డిజిటల్ న్యూస్.సెప్టెంబర్ 3 కోదాడ నియోజకవర్గం మునగాల మండలం రిపోర్టర్ (షేక్ మీరా) దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 17వ వర్ధంతిని పురస్కరించుకుని మునగాల మండల వ్యాప్తంగా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. మండలంలోని పలు గ్రామాల్లో వైఎస్సార్‌ విగ్రహాలు, చిత్రపటాలకు కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు. ముకుందాపురం గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు రేనబోతు సుమన్‌రెడ్డి ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్‌ కొల్లాపూరి రాములమ్మ అధ్యక్షతన వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, పేద ప్రజల కోసం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ నర్రా శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ బొల్లా వెంకటరెడ్డి, ముస్కుల సైదిరెడ్డి, ముస్కుల గోవిందరెడ్డి, రాంపంగు సైదులు, చంటి, రేనబోతు నర్సిరెడ్డి, వెంకటరెడ్డి, తాళ్ల శ్రీను, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. రేపాల గ్రామంలో సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు బెజవాడ సీతారాములు ఆధ్వర్యంలో వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వైఎస్సార్‌ ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేసి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, ఆయన పాలనను ప్రజలు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారని అన్నారు. కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు పల్లి వీరారెడ్డి, చిట్యాల నర్సిరెడ్డి, రావు బుచ్చిరెడ్డి, దేవాలయ చైర్మన్‌ సారిక చిన్నరామయ్య, బత్తుల నరసయ్య, చిట్యాల మోహన్‌రెడ్డి, పల్లి జాన్‌రెడ్డి, సోంపొంగు సాయి, పేరెల్లి బాబురావు, గోపిరెడ్డి, చిట్యాల పిచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మునగాల గ్రామంలో కాంగ్రెస్‌ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కొమ్ము ఈదారావు ఆధ్వర్యంలో వైఎస్సార్‌ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం ఆయన ప్రజలకు చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కాసర్ల కోటేశ్వరరావు, ఉప సర్పంచ్‌ కాసర్ల వెంకటేశ్వర్లు, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు తక్కెళ్లపాటి సాయి, సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌ మండల శ్రీనివాస్‌ (ఆర్‌ఎంపీ), శక్తిగిరి మండల శ్రీనివాస్‌, గాలి మిషన్‌ చిన్న తదితరులు పాల్గొన్నారు. మండలంలోని ఇతర గ్రామాల్లోనూ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్‌ వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు వైఎస్సార్‌ అందించిన సంక్షేమ పాలన, అభివృద్ధి కార్యక్రమాలను గుర్తుచేసుకుంటూ ఆయన ఆశయాల సాధనకు కృషి చేస్తామని పేర్కొన్నారు.