
సాక్షి డిజిటల్ డివిజన్ గద్వాల్, సెప్టెంబర్ 3, రాజోలి మండలం న్యూస్, జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో (కేజీబీవీ ) పోలీసు శాఖ ఎస్ ఐ, కిరణ్ కుమార్, మరియు ప్రిన్సిపల్ చంద్రకళ, ఆధ్వర్యంలో సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలపై విద్యార్థినులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో పోలీసులు విద్యార్థినులకు అందించిన ముఖ్యమైన సూచనలు మరియు అవగాహన వివరాలు:ఆన్లైన్ భద్రత, తెలియని వ్యక్తుల నుంచి వచ్చే వీడియో కాల్స్, సందేశాలు లేదా ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను స్వీకరించకూడదు. వ్యక్తిగత వివరాలు, సోషల్ మీడియా లేదా ఇతర ఆన్లైన్ యాప్‌లలో వ్యక్తిగత వివరాలు, ఫోటోలు, బ్యాంక్ ఖాతా సమాచారం లేదా ఓటీపీ (ఓటీపీ )లను ఎవరితోనూపంచుకోకూడదు.సైబర్ బుల్లీయింగ్వేధింపులు: సోషల్ మీడియాలో ఎవరైనా వేధింపులకుగురిచేస్తేభయపడకుండా, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు లేదా పోలీసులకు తెలియజేయాలి. టోల్ ఫ్రీ నంబర్లు: సైబర్ నేరాలకు గురైతే తక్షణమే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు లేదా 100 కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు స్థానిక పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.