
సాక్షి డిజిటల్ న్యూస్. సెప్టెంబర్ 3. (మెదక్ జిల్లా బ్యూరో ఇంచార్జ్. ఫణి కుమార్) కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పెద్ద శంకరంపేటలో ‘కాంగ్రెస్ బాకీ కార్డుల’ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. బీఆర్‌ఎస్ పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు, పార్టీ నాయకులు మండల నాయకుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నాయకులు మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులు, పేదలు సహా అన్ని వర్గాల ప్రజలకు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని అన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తు చేసేందుకే ‘కాంగ్రెస్ బాకీ కార్డుల’ను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి రైతులు, మహిళలు, యువత, నిరుద్యోగులు, పేదల సమస్యలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చి ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరారు. హామీలు నెరవేర్చే వరకు ప్రజల్లోకి.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ప్రభుత్వ వైఫల్యాలను గ్రామగ్రామాన ప్రజలకు వివరిస్తామని బీఆర్‌ఎస్ నాయకులు స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై బీఆర్‌ఎస్ నిరంతరం పోరాటం చేస్తుందని, ప్రజల పక్షాన నిలబడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జంగం శ్రీనివాస్, సురేష్ గౌడ్, సుభాష్ చంద్రబోస్, సత్యనారాయణ, జంగం రాఘవ, శంకర్ గౌడ్, అశోక్, చందు, రమేష్, రవీందర్, మల్లేశం, రాంరెడ్డి శ్రీనుతో పాటు బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.