14 వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిఎస్పీ పార్టీ ఆద్వర్యంలో వినతి

సాక్షి డిజిటల్ న్యూస్ ఆగస్టు 3 అచ్చంపేట (రిపోర్టర్ కొమ్ము రేణయ్య) రాష్ట్రలో 14 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట తహశీల్దార్ కార్యాలయంలో ధర్మ సమాజ్ పార్టీ మండల నాయకులు విష్ణు మహారాజ్ ఆధ్వర్యంలో మండల ఆర్ఐకీ వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో బిసి,ఎస్సీ ఎస్టీ-జాక్ జిల్లా కో ఆర్డినేటర్ మరియు డిఎస్పీ జిల్లా అధ్యక్షులు సాయి మహారాజ్ పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన దాదాపు 14 వేల కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నాయి అని ఈ ఫీజులు చెల్లించలేని దుస్థితి కారణంగా ముఖ్యంగా బీసీ,ఎస్సీ,ఎస్టీ విద్యార్థులు కళాశాలలో తమ చదువులను కొనసాగించేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అన్నారు.బకాయిలు ఆలస్యం కావడం వల్ల విద్యార్థుల చదువులకు తీవ్ర ఆటంకం కలిగి మధ్యలోనే ఆగిపోతున్నాయి అన్నారు.కొందరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మొత్తంగా ఈ ప్రభావం ఒక కోటి కుటుంబాలపై పడిందని ఇంతటి దుర్భర పరిస్థితిని బీసీ,ఎస్సీ,ఎస్టీ పేద విద్యార్థులు ఎదుర్కొంటున్నారు అన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ఈ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేసి విద్యార్థులు ఎటువంటి ఆటంకం లేకుండా తమ విద్యను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అర్జెంటుగా ప్రభుత్వం కళాశాలలో చెల్లించే ఫీజులతో నిమిత్తం లేకుండా విద్యార్థుల సర్టిఫికెట్లు కాలేజీ యాజమాన్యం ఆపకుండా వెంటనే ఇచ్చేలా ఒక (జీవో) ని విడుదల చేయాలని సాయి మహారాజ్ డిమాండ్ చేశారు కార్యక్రమంలో బిసి, ఎస్సీ ఎస్టీ-జాక్ మండల నాయకులు విజయ్, వామావత్ గోపాల్ నాయక్,శ్రీను ముదిరాజ్, డిఎస్పీ మండల నాయకులు విష్ణు,వీరయ్య కార్యకర్తలు పాల్గొన్నారు.