22ఏ జీవోపై మహేంద్ర హిల్స్ వాసుల ఆగ్రహం భానుగా నర్మదా మల్లికార్జున్

సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ నటరాజ్ గౌడ్ సెప్టెంబర్ 3. సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్ సమస్యల పరిష్కారం కోసం స్థానిక ఎంపీ ఈటల రాజేందర్‌ కి వినతి పత్రం అందచేసారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న 22ఏ నిబంధనల కారణంగా మహేంద్ర హిల్స్ పరిధిలోని దాదాపు 16 కాలనీలు ముఖ్యముగా త్రిమూర్తి కాలనీ, కాలనీ శాంతినికేతన్ కాలనీ, ధనలక్ష్మీ కాలనీ, రవి కాలనీ, బాలంరాయి కాలనీ, సంతోష్ కాలనీ, వైజయంతి కాలనీ లకు సంబంధించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యపై కాలనీవాసులు, సంక్షేమ సంఘాల ప్రతినిధులు స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ ని కలిసి తమ ఆవేదనను తెలియజేశారు. అనంతరం త్రిమూర్తి కాలనీ లో కేంద్ర మాజీ మంత్రివర్యులు పెద్దలు శ్రీ సర్వే సత్యనారాయణ ని ఎంపి మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. 5వ తేదీన ఇందిరా పార్క్ వద్ద ధర్నా. ఈ సమస్యపై ప్రభుత్వం నుంచి తగిన స్పందన రాకపోవడంతో, సమస్య తీవ్రతను తెలియజేసేందుకు ఈ నెల 5వ తేదీన ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద శాంతియుత మహాధర్నా నిర్వహించనున్నట్లు కాలనీ ప్రతినిధులు ప్రకటించారు. మహేంద్ర హిల్స్ పరిధిలోని కాలనీవాసులు, స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ ధర్నాకు సంపూర్ణ మద్దతు తెలిపి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా కంటోన్మెంట్ పరిధిలో నెలకొన్న పలు సమస్యలను ముఖ్యంగా బీటీ,సిమెంట్ రోడ్లు, వీధి దీపాలు, డ్రైనేజ్ సమస్యలను వివరిస్తూ కంటోన్మెంట్ బోర్డ్ నామినేటెడ్ మెంబర్ బానుక నర్మద మల్లికార్జున్ కి కాలనీవాసులు వినతిపత్రం అందజేశారు. కాలనీల్లో నెలకొన్న ప్రాథమిక సమస్యలను వెంటనే పరిష్కరించేలా సంబంధిత అధికారులతో మాట్లాడాలని కోరారు. ఈ కార్యక్రమంలోఎమ్మెల్సీ మల్కా కొమురయ్య, మాజీ ఎమ్మెల్యే ఎందల లక్ష్మీనారాయణ, నామినేటెడ్ మెంబర్ బానుక నర్మద మల్లికార్జున్, బి.ఎన్. శ్రీనివాస్ మరియు వివిధ కాలనీలకు సంబంధించి మధుసూదన్, రఘు, రవి, సుభాష్, బాబ్ల కొణిజేటి సంతోష్, గోయల్, నర్సింగ రావు, లక్ష్మీ కాంతం మరియు కార్యవర్గ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.