రాజోలి మండలంలో యథేచ్ఛగా ఇసుక మాఫియా

* ప్రభుత్వ ఆదాయానికి గండి.

సాక్షి డివిజన్స్ గద్వాల్ మే 4 వెంకటేష్ రిపోర్టర్ రాజోలి మండలం, రాజోలి: రాజోలి మండలంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ఎలాంటి అనుమతులు, బిల్లులు లేకుండా రోజుకు సుమారు 400 ట్రిప్పుల ఇసుకను టిప్పర్లు, ట్రాక్టర్లలో అక్రమంగా తరలిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడుతోంది. పగలు, రాత్రి తేడా లేకుండా ఇసుక తరలింపు కొనసాగుతుండగా, మండలంలో శుభకార్యాలు జరుగుతున్న సమయంలోనూ ట్రాక్టర్లు అతివేగంగా దూసుకెళ్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై చిన్నపిల్లలు తిరుగుతుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఇసుక మాఫియాపై రెవెన్యూ అధికారులు, ఎమ్మార్వో వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని, జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని అక్రమ తరలింపును అడ్డుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *