సర్ ఓటర్ జాబితా నోటీసులపై ఓటర్లకు అవగాహన అనుమానాల నివృత్తి

🖨️ Print

సాక్షి డిజిటల్ న్యూస్ సయ్యద్ సాదిక్ ఖమ్మం టౌన్ రిపోర్టర్ 3 సెప్టెంబర్ ఖమ్మం నగరంలోని 50వ డివిజన్ బురహన్‌పురం ప్రాంతంలో ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో సర్ ఓటర్ జాబితాకు సంబంధించిన నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో 134, 135, 136, 137 పోలింగ్ స్టేషన్ల పరిధిలోని బి ఎల్ ఓ లు, ఓటర్లను బి ఆర్ ఎస్ పార్టీ 50వ డివిజన్ సీనియర్ నాయకుడు లింగనబోయిన సతీష్ కలిసి, సర్ నోటీసులకు సంబంధించిన సందేహాలు, అనుమానాలను నివృత్తి చేస్తూ ఓటర్లకు అవసరమైన అవగాహన కల్పించారు. ప్రతి అర్హత కలిగిన ఓటు ఆన్‌లైన్‌లో సక్రమంగా నమోదు అయ్యేలా ఓటర్లు తమ వివరాలను పరిశీలించుకోవడంతో పాటు, అవసరమైన ప్రక్రియను పూర్తి చేసుకునే విధంగా లింగనబోయిన సతీష్ సహకారం అందించారు. ఓటర్లందరూ సర్ ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి, తమ ఓటు హక్కును కాపాడుకునేందుకు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *